ఖమ్మం-బోనకల్ రోడ్డుపై విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఖమ్మం-బోనకల్ రోడ్డుపై విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
చింతకాని: ఖమ్మం-బోనకల్ ప్రధాన రహదారిపై ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రామకృష్ణాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.
చింతకాని సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామేపల్లి మండలం ముచ్చెర్ల గ్రామానికి చెందిన జాని అనే యువకుడు మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తుండగా రామకృష్ణాపురం సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment