వామ్మో.. దెయ్యమని భయపడి హాస్టల్ ఖాళీ చేసిన 608 మంది విద్యార్థులు

 

వామ్మో.. దెయ్యమని భయపడి హాస్టల్ ఖాళీ చేసిన 608 మంది విద్యార్థులు

వామ్మో.. దెయ్యమని భయపడి హాస్టల్ ఖాళీ చేసిన 608 మంది విద్యార్థులు

మహారాష్ట్రలోని మేల్ఘాట్ జిల్లా చిఖల్దారా తాలూకాలో ఉన్న డోమా ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో వింత ఘటన కలకలం రేపింది. పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్న కొందరు విద్యార్థినులు అకస్మాత్తుగా విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించారు.

కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని కారణం లేకుండా ఏడవడం, బిగ్గరగా నవ్వడం, అరవడం, అలాగే కొంతసేపు ఎలాంటి స్పందన లేకుండా ఒకే చోట ఉండిపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత ఇదే తరహా ప్రవర్తన మరికొందరు విద్యార్థినుల్లోనూ కనిపించడంతో పాఠశాలలో భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ ఘటనపై పాఠశాలలో దెయ్యం తిరుగుతోందనే వదంతులు వ్యాపించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయానికి గురయ్యారు. తమ పిల్లల భద్రతపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఏకంగా 608 మంది విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం నాటికి ఆశ్రమ పాఠశాల దాదాపు పూర్తిగా ఖాళీ అయింది.

పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అమరావతి నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ బృందాన్ని రప్పించారు. విద్యార్థులతో కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ, ఈ విచిత్ర ప్రవర్తనకు ఖచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేకపోయారు.

అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ అంకిత్ రాథోడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో కనిపించిన లక్షణాలు తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా ఏర్పడే ‘మాస్ హిస్టీరియా’ కావచ్చని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు.

మరోవైపు పాఠశాల ఘటనపై గ్రామాల్లో కూడా భయాందోళనలు నెలకొనడంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు, భయాన్ని తొలగించేందుకు కౌన్సెలింగ్ కొనసాగిస్తున్నారు. అధికారులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ, ఘటనకు అసలు కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Blogger ఆధారితం.