సంచార ముస్లింల హామీల అమలుకు ఉద్యమించాలి: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు వినతి
సంచార ముస్లింల హామీల అమలుకు ఉద్యమించాలి: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు వినతి
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో సంచార ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేయించేలా ప్రతిపక్షాలు గళం విప్పాలని తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం కోరింది. ఈ మేరకు సంఘం నాయకులు ప్రధాన ప్రతిపక్ష నేత డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్రంలో నిర్వహించిన కులగణన ప్రకారం బీసీల వెనకబాటు సూచిక (CBI స్కోర్)లో సంచార ముస్లింలు అత్యంత వెనకబడిన వర్గంగా ఉన్నారని, ఎస్సీ, ఎస్టీలలోని అనేక ఉపకులాల కంటే అధ్వాన్న పరిస్థితుల్లో జీవిస్తున్నారని సంఘం నాయకులు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం వారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో హామీలను అమలు చేసే వరకు ప్రతిపక్షాలు ఉద్యమించాలని, ఈ అంశాన్ని రాజకీయంగా బలంగా ప్రస్తావించాలని కోరారు.
సంఘం ప్రధాన డిమాండ్లు:
- సంచార ముస్లింల సంక్షేమం కోసం రూ.1,000 కోట్ల బడ్జెట్‌తో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు.
- కోకాపేటలో సంచార ముస్లింల ఆత్మగౌరవ భవన నిర్మాణం.
- విద్యలో వెనుకబడిన విద్యార్థుల కోసం 'తౌఫా ఏ తాలీం' పథకాన్ని అమలు చేసి ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు అందించడం.
- మైనారిటీ నాయకులు రాజకీయ ప్రయోజనాలకే పరిమితం కాకుండా సంచార ముస్లింల హక్కుల సాధన కోసం పోరాడాలని విజ్ఞప్తి.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం స్థాపకులు ఎండీ షబ్బీర్, పొలిటికల్ ప్రెసిడెంట్ షైక్ హమీద్ ఉద్దీన్, కోశాధికారి ఎండీ షాదుల్లా, కరీంనగర్ యూత్ ప్రెసిడెంట్ అబ్దుల్లా, సలీం, సయ్యద్ రజ్జాక్, షామీమ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment