ఎస్‌ఓ‌టీ ఆర్‌సీ పురం సబ్‌యూనిట్ నూతన కార్యాలయం ప్రారంభం

 

ఎస్‌ఓ‌టీ ఆర్‌సీ పురం సబ్‌యూనిట్ నూతన కార్యాలయం ప్రారంభం

ఎస్‌ఓ‌టీ ఆర్‌సీ పురం సబ్‌యూనిట్ నూతన కార్యాలయం ప్రారంభం

సైబరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌ఓ‌టీ ఆర్‌సీ పురం సబ్‌యూనిట్ నూతన కార్యాలయ భవనాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా నూతన కార్యాలయాన్ని పరిశీలించిన సీపీ.. సిబ్బందికి అందుబాటులో ఉన్న వసతులు, కార్యాలయ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. నేర నియంత్రణతో పాటు అక్రమ కార్యకలాపాలపై నిఘా, కీలక కేసుల దర్యాప్తులో ఎస్‌ఓటీ విభాగం మరింత సమర్థవంతంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.

ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు ఎస్‌ఓటీ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు సీపీ తెలిపారు. నేరాల నియంత్రణలో సాంకేతికతను వినియోగిస్తూ సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటీ డీసీపీ పి. శోభన్ కుమార్, అడిషనల్ డీసీపీ టి. గోవర్ధన్, శేరిలింగంపల్లి డీసీపీ సి.హెచ్. శ్రీనివాస్‌తో పాటు సైబరాబాద్ పరిధిలోని వివిధ జోన్లకు చెందిన ఎస్‌ఓటీ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఓటీ సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.