ఏసీబీ వలకు చిక్కిన మరో అక్రమాస్తుల ఆరోపణలలో ఉన్నతాధికారి!
ఏసీబీ వలకు చిక్కిన మరో అక్రమాస్తుల ఆరోపణలలో ఉన్నతాధికారి!
హైదరాబాద్, ఆగస్టు 20: అవినీతి, అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో అడ్మిన్ అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. గురువారం ఉదయం నుంచి ఆయన నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శ్రీనివాస్‌రెడ్డి బంధువులు, స్నేహితులకు సంబంధించినట్లు గుర్తించిన సుమారు 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన ఆస్తులు, నగదు, బంగారం తదితర వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో ఆయన మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ మండలాల్లో తహసీల్దార్ (ఎమ్మార్వో)గా విధులు నిర్వహించారు. సోదాలు పూర్తయిన అనంతరం ఆస్తులకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.

Post a Comment