శేరిలింగంపల్లి గురుకులంలో దారుణం.. జూనియర్ విద్యార్థులపై సీనియర్ల లైంగిక దాడి ఆరోపణలు

 

శేరిలింగంపల్లి గురుకులంలో దారుణం.. జూనియర్ విద్యార్థులపై సీనియర్ల లైంగిక దాడి ఆరోపణలు

శేరిలింగంపల్లి గురుకులంలో దారుణం.. జూనియర్ విద్యార్థులపై సీనియర్ల లైంగిక దాడి ఆరోపణలు

హైదరాబాద్: శేరిలింగంపల్లి సమీపంలోని తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ గురుకుల పాఠశాలలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. హాస్టల్‌లో ఉంటున్న ఇద్దరు జూనియర్ విద్యార్థులపై ముగ్గురు సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో తీవ్ర కలకలం రేగింది.

సమాచారం ప్రకారం, ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గత కొద్ది రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. పిల్లల పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు కారణం ఏమిటని ప్రశ్నించగా, తమపై ముగ్గురు సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారని చిన్నారులు తెలిపినట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్‌లోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు కౌన్సెలింగ్ అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తూ ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.