యాడారం, శివరామిరెడ్డిపల్లిలో ఘనంగా స్వాగత తోరణం భూమి పూజ

 

యాడారం, శివరామిరెడ్డిపల్లిలో ఘనంగా స్వాగత తోరణం భూమి పూజ
బీఆర్‌సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యేకు వినతి

బీబీపేట: కామన్‌ స్వాగత తోరణం నిర్మాణానికి యాడారం, శివరామిరెడ్డిపల్లి గ్రామాల ఉమ్మడి వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల సహకారంతో చేపట్టనున్న ఈ స్వాగత తోరణం నిర్మాణ పనులకు గ్రామ వీడీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్లు భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, యువకులు, వీడీసీ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి, ఐక్యతకు ప్రతీకగా స్వాగత తోరణం నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

గ్రామ ప్రజల సహకారంతో నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి, అందరికీ ఆకర్షణీయంగా ఉండేలా స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ వీడీసీ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Blogger ఆధారితం.