బీఆర్‌సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యేకు వినతి

బీఆర్‌సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యేకు వినతి

బీఆర్‌సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యేకు వినతి

మర్రికుంట: బీఆర్‌సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాలని కోరుతూ కాలనీవాసులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు.

మర్రికుంట బీఆర్‌సీ కాలనీలోని పీఆర్ రెస్టారెంట్‌కు ఎదురుగా ఉన్న రహదారి గత ఏడాది వర్షాల సమయంలో పూర్తిగా బురదమయంగా మారడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని అప్పట్లో ఎమ్మెల్యేను కలిసి డ్రైనేజీ, రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినతిపత్రం సమర్పించారు.

కాలనీవాసుల విజ్ఞప్తిపై స్పందించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించారు. అయితే డ్రైనేజీ నిర్మాణం అనంతరం రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించకపోవడంతో వర్షం పడినప్పుడు రహదారి బురదమయంగా మారుతోంది. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు స్కిడ్ అయి ప్రమాదాలకు గురవుతున్నాయని కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో బీఆర్‌సీ కాలనీలో నెలకొన్న సమస్యలపై కాలనీవాసులు బుధవారం ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ త్వరలోనే అవసరమైన నిధులు మంజూరు చేసి సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.

సీసీ రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌సీ కాలనీకి చెందిన పలువురు నివాసితులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.