సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: డిప్యూటీ సీఎం భట్టి

 

సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: డిప్యూటీ సీఎం భట్టి

సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, ఆగస్టు 24: తెలంగాణ జీవనాడిగా ఉన్న సింగరేణి సంస్థను కాపాడుకుంటూ, భవిష్యత్ తరాలకు లాభదాయకమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థను కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం చేయకుండా కీలక ఖనిజాల (Critical Minerals) మైనింగ్ వైపు విస్తరిస్తున్నామని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాపర్, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్, బంగారం వంటి కీలక ఖనిజాల అన్వేషణ, తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే నైని, తాడిచర్ల-2, మణుగూరు డిప్‌సైడ్-2 వంటి కీలక బొగ్గు బ్లాక్‌లను సింగరేణి సాధించిందని తెలిపారు. అలాగే కర్ణాటకలో జరిగిన గోల్డ్ మైన్ వేలంలో విజయం సాధించడం ద్వారా సింగరేణి కొత్త రంగాల్లోకి అడుగుపెట్టిందన్నారు.

100 ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేసి, దేశంలోనే అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. NTPC స్థాయిలో సింగరేణిని జాతీయ స్థాయిలో అగ్రగామి సంస్థగా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సంస్థగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని కాపాడుతూ, సంస్థకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడం ద్వారా భవిష్యత్ తరాలకు కూడా సింగరేణిని లాభదాయకమైన సంస్థగా కొనసాగించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Blogger ఆధారితం.