వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ అంకిత్


వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

కొత్తగూడెం, ఆగస్టు 25: వన మహోత్సవం సందర్భంగా జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. ఇల్లందు క్రాస్‌రోడ్‌లోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, పాఠశాల విద్యార్థులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించి వృక్షాలుగా ఎదిగేలా చూడాలని సూచించారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించడం, రక్షణ కల్పించడం వంటి చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని తెలిపారు.

పాఠశాల విద్యార్థులు వన మహోత్సవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తమ ఇళ్ల వద్ద, పాఠశాల ఆవరణలో, పరిసర ప్రాంతాల్లో కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ప్రస్తుత తరంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే పచ్చదనం అత్యంత అవసరమని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు సమష్టిగా కృషి చేసి వన మహోత్సవ లక్ష్యాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Blogger ఆధారితం.