భద్రాచలంలో గోదావరి ఒడ్డుకు గుర్తు తెలియని మృతదేహం..

 

భద్రాచలంలో గోదావరి ఒడ్డుకు గుర్తు తెలియని మృతదేహం..

భద్రాచలంలో గోదావరి ఒడ్డుకు గుర్తు తెలియని మృతదేహం.. వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి

భద్రాచలం, ఆగస్టు 7: భద్రాచలం పట్టణంలో గోదావరి నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం భద్రాచలం గోదావరి వంతెన కింద ఉన్న వైకుంఠధామం సమీపంలో ఓ గుర్తు తెలియని మృతదేహం నది ఒడ్డుకు కొట్టుకొచ్చింది. సమాచారం అందుకున్న భద్రాచలం టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

పోలీసుల వివరాల ప్రకారం, మృతుడి వయస్సు సుమారు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆయనకు ఎరుపు రంగు ఛాయ, తెల్ల జుట్టు, బట్టతల ఉన్నట్లు గుర్తించారు. మృతుడు సిమెంట్ రంగు షర్ట్, గ్రీన్ కలర్ షర్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మృతుడి వివరాలు ఇంకా గుర్తించలేకపోయామని, ఆయనకు సంబంధించిన సమాచారం ఎవరైనా తెలిసినట్లయితే వెంటనే భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మృతుడి గుర్తింపునకు సంబంధించిన సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి గుర్తింపు కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.