తెలంగాణ రక్షణ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సముద్రాల క్రాంతి కుమార్ మీడియా సమావేశం
తెలంగాణ రక్షణ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సముద్రాల క్రాంతి కుమార్ మీడియా సమావేశం
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు సముద్రాల క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించిన పలు అంశాలు, తెలంగాణ రక్షణ సేన చేపట్టనున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సముద్రాల క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రజలకు అండగా నిలిచేందుకు తెలంగాణ రక్షణ సేన నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.
సంస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి ప్రజలతో మమేకమై పనిచేస్తామని నాయకులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో తెలంగాణ రక్షణ సేన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వీరన్న, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రెటరీ కనగాల చైతన్య, తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment