ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు
ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు
కొత్తగూడెం: జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనీనా ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఆర్డీఓ విద్యా చందన, డీఆర్వో పద్మావతి, జెడ్పీసీఈఓ నాగలక్ష్మి, డీపీఓ అనూష, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసినందుకు స్వచ్ఛంద సంస్థల విభాగంలో అఖిల విశ్వ గాయత్రీ పరివార్ హరిద్వార్ ఇల్లందు శాఖ జిల్లా సమన్వయకర్త డా. సతీష్ ఖండేల్వాల్ను ప్రతిభా పురస్కారంతో సత్కరించారు. ఆయన అందిస్తున్న సామాజిక సేవలను అధికారులు అభినందించారు.
అనంతరం అధికారులు వృద్ధుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం, రక్షణ, ఆరోగ్యం, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. వయోవృద్ధుల పట్ల కుటుంబ సభ్యులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ గౌరవం, ఆప్యాయతతో వ్యవహరించాలని సూచించారు.
వయోవృద్ధుల అనుభవాలు, సేవలు సమాజానికి ఎంతో విలువైనవని, వారి సంక్షేమానికి అవసరమైన సహకారం అందించేందుకు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

Post a Comment