అనకాపల్లి లో 126 అడుగుల మట్టి గణపతి విగ్రహం
విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణం ఈసారి వినాయక నవరాత్రి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎన్టీఆర్ క్రీడా మైదానం వద్ద 126 అడుగుల ఎత్తైన శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం ఏర్పాటు చేయబడింది. ఇది దేశంలోనే అతిపెద్ద మట్టి గణపతి విగ్రహంగా గుర్తింపు పొందే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
ఈ విగ్రహ నిర్మాణం ప్రముఖ శిల్పి కామదేను ప్రసాద్ పర్యవేక్షణలో 30 మంది కళాకారులు నెల రోజుల పాటు కష్టపడి రూపొందించారు. విగ్రహం తయారీలో 10 టన్నుల బంకమట్టి, మండప నిర్మాణానికి 90 టన్నుల సర్వేకర్ర, వస్త్రధారణకు 150 తానులు వస్త్రం వినియోగించారు.
🔸 ఉత్సవాల ముఖ్యాంశాలు
- ప్రారంభం: వినాయక చవితి రోజున, ఆగస్టు 27
- ముగింపు: సెప్టెంబర్ 23 (నిమజ్జనం అదే ప్రాంగణంలో)
- అన్నదానం: సెప్టెంబర్ 22న 30 వేల మందికి
- సాంస్కృతిక కార్యక్రమాలు: ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పోటీలు
- సేవ: 5,000 మందికి పైగా శ్రీహరి సేన సభ్యులు పాల్గొననున్నారు
🔸 భక్తుల రాకపోకలు
ఉత్సవ కాలంలో దేశవ్యాప్తంగా 20–25 లక్షల మంది భక్తులు దర్శనానికి రానున్నారని నిర్వాహకులు అంచనా వేశారు. ఈ ఉత్సవాల కోసం సుమారు 70 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు.
"ఈ మహోత్సవం కుల, మతాలకు అతీతంగా అందరి సహకారంతో జరుగుతుంది" అని ఉత్సవ కమిటీ కన్వీనర్ బుద్ధ భూలోక నాయుడు తెలిపారు.
Post a Comment