మట్టి వినాయకులను పూజిద్దాం సామాజికవేత్త ఎం. శ్రీనివాస్ కుమార్
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పూజించాలని ప్రముఖ వ్యాపారి, సామాజికవేత్త ఎం. శ్రీనివాస్ కుమార్ ప్రజలను కోరారు.
ఆయన మాట్లాడుతూ – “ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను నదులు, చెరువులలో నిమజ్జనం చేయడం వలన నీటిలో కలుష్యం పెరుగుతుంది. దీనివల్ల నీటిలో నివసించే చేపలు, ఇతర జలజ జీవులు ప్రాణహాని చెందుతాయి. అలాగే కలుషిత నీటిని తాగిన జంతువులకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. ఇది పర్యావరణానికి గణనీయమైన నష్టం కలిగిస్తుంది,” అని అన్నారు.
అలాగే, “మట్టి వినాయకులను సహజ రంగులతో తయారు చేస్తారు. ఇవి నీటిలో కలిసిపోయినప్పుడు ఎలాంటి హానీ కలగదు. అందువల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. అందరూ మట్టి వినాయకులను పూజించడం ద్వారా సమాజ శ్రేయస్సు, ఆరోగ్యం, సుఖశాంతులు పొందవచ్చు,” అని తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ కుమార్ వెల్లడిస్తూ, “మట్టి వినాయక విగ్రహాలను అనేక సంస్థలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. అందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి” అని హిందూ బంధువులను కోరారు.
Post a Comment