ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం! యువతి ప్రాణాన్ని బలిగొంది

ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం! యువతి ప్రాణాన్ని బలిగొంది


అనంతపురం జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాన్ని బలిగొంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ రూపం దాల్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సాయినగర్‌లోని దీపు బ్లడ్ బ్యాంక్‌లో అరుణ్‌కుమార్, ప్రతిభాభారతి, స్వాతి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. గత రెండేళ్లుగా అరుణ్‌కుమార్, ప్రతిభాభారతి ప్రేమలో ఉన్నారు. ఇదే సమయంలో అరుణ్, గొందిపల్లి గ్రామానికి చెందిన స్వాతితో రహస్యంగా మరో ప్రేమ సంబంధం కొనసాగించాడు.

ఇటీవల ఈ వ్యవహారం ప్రతిభాభారతికి తెలిసి, ఆమె ఆగ్రహంతో స్వాతిని ఫోన్‌లో తీవ్రంగా మందలించింది. "నా ప్రియుడితో ప్రేమలో పడతావా? ఈ రోజు ల్యాబ్‌కి రా.. నీ సంగతి తేలుస్తా" అంటూ బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ బెదిరింపు కారణంగా భయాందోళనకు గురైన స్వాతి, తీవ్ర మనస్తాపంతో హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.