సైబర్ నేరాలకు పాల్పడుతున్న 13 మంది అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజుల క్రితం NCRP (నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్) ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా టేకులపల్లి పోలీసులు, జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు సంయుక్తంగా 24వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 13 మందిని అరెస్ట్ చేశారు.
నేర పద్ధతి
టేకులపల్లిలో మీ-సేవా కేంద్రం నడుపుతున్న బోడా శ్రీధర్ టెలిగ్రామ్ యాప్ ద్వారా పరిచయమైన సైబర్ నేరగాళ్లతో కలిసి, నకిలీ పత్రాలతో 60 కరెంట్ అకౌంట్లు తెరచి, రూ. 8.5 కోట్ల లావాదేవీలు జరిపినట్టు పోలీసులు గుర్తించారు.
పోలీసులు నిందితుల వద్ద నుంచి 12 సెల్‌ఫోన్లు, ఒక బ్యాంకు పాస్‌బుక్ స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వీరి పేరుపై 108 ఫిర్యాదులు నమోదైనట్టు సమాచారం.
పట్టుబడినవారి వివరాలు
- A1. బోడా శ్రీధర్, 27, టేకులపల్లి
- A2. బోడా రాజేష్, 25, రాంపురం (టేకులపల్లి)
- A3. బోడా రాజన్న, 22, టేకులపల్లి
- A4. బనోత్ జగదీష్, 27, సింగ్యా తండా
- A5. తేజవత్ నరేష్, 25, బిల్లుడు తండా
- A6. పోలేపొంగు పవన్ కళ్యాణ్, 27, రామాలయం వీధి, టేకులపల్లి
- A7. భూక్య వీరన్న, 26, బద్దు తండా
- A8. జాటోత్ నరేష్, 24, పాత తండా
- A9. బోడా జంపన్న, 25, టేకులపల్లి
- A10. బోడా రాజారం, 27, రాంపురం తండా
- A11. భూక్య ప్రవీణ్, 24, బద్దు తండా
- A12. మలోత్ ప్రవీణ్, 24, మద్దిరాల తండా
- A13. ఉరిమల్ల భరత్ కృష్ణ, 27, టేకులపల్లి
తదుపరి చర్యలు
అరెస్టైన నిందితులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఇల్లందు కోర్టుకు తరలించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న టేకులపల్లి CI బి. సత్యనారాయణ, SI ఎ. రాజేందర్, సైబర్ క్రైమ్ CI ఎస్. జితేందర్ మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ప్రజలకు హెచ్చరిక
సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసి డబ్బులు దోచుకోవడానికి కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారని పోలీసులు హెచ్చరించారు.
- జిల్లా వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
- సైబర్ నేరాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవు.
- ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.
Post a Comment