వేలాది విద్యార్థుల భవిష్యత్తు వెలిగించిన బాబుఖాన్ ఇకలేరు

వేలాది విద్యార్థుల భవిష్యత్తు వెలిగించిన బాబుఖాన్ ఇకలేరు


హైదరాబాద్‌ జకాత్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు గియాసుద్దీన్ బాబు ఖాన్ (GBK) మరణం సమాజానికి అపూర్వ లోటు. పేద, వెనుకబడిన వర్గాల వేలాది విద్యార్థులకు విద్యాసహాయం అందించి, వారి భవిష్యత్తు నిర్మాణంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

వికారాబాద్‌లోని హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్, FEED, GBKCT వంటి సంస్థల ద్వారా కులమత భేదాలు లేకుండా అనేక సేవలు అందించారు. విద్య, ఉపాధి, మానవసేవల పట్ల ఆయన చూపిన కృషి అప్రతిమం.

ఒక దాత, మార్గదర్శి, మానవతావాదిగా బాబు ఖాన్ చేసిన సేవలు చిరస్మరణీయమని జమాత్ ఇ ఇస్లామీ హింద్ వైస్ ప్రెసిడెంట్ ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, జాతీయ కార్మిక నేతలు, పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అలాంటి మహానుభావుడిని కోల్పోవడం బాధాకరమని అందరూ పేర్కొంటున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.