వీధి కుక్కలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆందోళన సృష్టించిన వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేస్తూ, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది.
కోర్టు స్పష్టం చేస్తూ —
- వీధి కుక్కలకు టీకాలు, డీవార్మింగ్ తప్పనిసరి
- చికిత్స అనంతరం వాటిని తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలి
- అయితే రేబిస్ బారిన పడ్డవి, ఆక్రోశ స్వభావం ఉన్నవి వీధుల్లో విడవరాదు
ఈ తీర్పుతో జంతు సంరక్షణను, ప్రజల భద్రతను సమన్వయపరిచే దిశగా ముందడుగు పడిందని న్యాయవర్గాలు అభిప్రాయపడ్డాయి.
సుప్రీం తీర్పు వెలువడటంతో జంతు సంక్షేమ సంస్థలు సంతోషం వ్యక్తం చేస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కుక్కల దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు ఈ ఆదేశాలు సమర్థవంతంగా అమలు అవుతాయో లేదో చూడాలని అంటున్నారు.

Post a Comment