వినాయక చవితి శుభాకాంక్షలు

నలుగుపిండితో పుట్టి.. గజాననుడవైన గణనాథుడా!


నలుగుపిండితో పార్వతీ అమ్మ ఊపిరి పోయగ అవతరించిన గణపయ్యా!
తల్లి మాటను శిరసావహించి, మహాదేవునికే ఎదిరించి నిలిచిన గణనాథుడా!

పల్లె–పట్నముల జనులందరూ నిన్ను కొనియాడుతూ స్వాగతం పలుకుతున్నారు.
దివి నుండి భువికి రావయ్యా ఓ గౌరీ తనయా!
పూలు, మామిడి తోరణాలతో అలంకరించి, కుడుములు–ఉండ్రాళ్ల నైవేద్యములతో నీ పూజలు చేసేందుకు ఎదురుచూస్తున్నాం గణపయ్యా!

అవిఘ్నమిచ్చే వినాయకా…

విఘ్నాలకు అధిపతివైన నీవు, అవిఘ్నమనే ఆశీర్వాదములు కురిపించవయ్యా.
భక్తి–శ్రద్ధలతో చేసిన పూజలు స్వీకరించి, పర్యావరణాన్ని పరిరక్షించుకునే బుద్ధి ప్రసాదించవయ్యా.

తల్లిదండ్రుల కంటే మించిన పుణ్యక్షేత్రం లేదని భావించి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసిన నీవు గణనాథుడవయ్యావు.
కుంజర ముఖాన్ని ధరించి గజాననుడవయ్యావు.

మట్టి గణపతి – పర్యావరణ పరిరక్షణ

“మట్టి గణపతిని పూజిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే శుభసందేశాన్ని అందరికీ చేరువచేస్తూ,
ఆదిపూజ్యుడికి అభివందనం, పార్వతీనందనుడికి ప్రియవందనం.

ఈ వినాయక చవితి సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.


✍️ రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
📞 9347042218


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.