బ్రేకింగ్ న్యూస్: హైదరాబాద్‌లో భారీగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం

బ్రేకింగ్ న్యూస్: హైదరాబాద్‌లో భారీగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం


హైదరాబాద్, రామంతపూర్ విద్యుత్ శాఖ ఘటనను కారణంగా చూపుతూ, కేబుల్ వైర్లను తొలగిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు హఠాత్తుగా చర్యలు చేపట్టారు. దీని ప్రభావంతో హైదరాబాద్ నగరంలో ఇంటర్నెట్ సేవలు గందరగోళానికి గురయ్యాయి.

ఒకే రోజులోనే 40 వేల ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు, 20 వేల జియో ఫైబర్ కనెక్షన్లు కట్ అయినట్లు సంబంధిత సంస్థలు వెల్లడించాయి.

ఆపరేటర్ల ఆగ్రహం

ఇంటర్నెట్ ఆపరేటర్లు TGSPDCL (తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) పై మండిపడుతున్నారు. “విచక్షణారహితంగా ఇంటర్నెట్ కేబుల్ ఫైర్లు కట్ చేస్తున్నారు. ఇలా కొనసాగితే హైదరాబాద్ డిజిటల్ మౌలిక వసతులన్నీ దెబ్బతింటాయి” అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వినియోగదారుల ఇబ్బందులు

ఎయిర్‌టెల్ ప్రతినిధులు మాట్లాడుతూ:
“మాత్రం రెండు గంటల్లోనే మా వద్దకు 40 వేల ఫిర్యాదులు వచ్చాయి” అన్నారు.

జియో ఫైబర్ కూడా ఇదే ధోరణి వ్యక్తం చేస్తూ, “20 వేల ఫిర్యాదులు మా కస్టమర్ కేర్‌కు వచ్చాయి. ఇంటర్నెట్ డిపెండెన్సీ ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అని పేర్కొంది.

నిపుణుల హెచ్చరిక

COAI (సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ ఎస్పీ కొచ్చర్ హెచ్చరిస్తూ –
“ఇంటర్నెట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాథమిక అవసరం. విద్యుత్ శాఖ ఇలాగే కేబుల్ లైన్లు కట్ చేస్తే హైదరాబాద్ నగరానికి తీవ్ర ఆర్థిక, సాంకేతిక నష్టం తప్పదు” అన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.