పోలీసుల అదుపులో గూఢచారి పావురం..?గ్రామంలో హాట్ టాపిక్

పోలీసుల అదుపులో గూఢచారి పావురం..? గ్రామంలో హాట్ టాపిక్


నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని భవానిపేట గ్రామంలో ఓ పావురం గూఢచారి అనుమానాలతో గ్రామస్థులలో కలకలం రేపింది. గ్రామంలోని ఒక మైనర్ బాలుడికి అనుమానాస్పదంగా దొరికిన ఈ పావురం ప్రత్యేకత ఏమిటంటే… దీని కాలికి కోడ్ రింగ్ ఉండగా, రెక్కలపై కొన్ని అక్షరాలు కనిపించాయి.

ఇదంతా గమనించిన బాలుడు పెద్దలకు చెప్పగా, గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని ఆ పావురాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పావురంపై విచారణ కొనసాగుతోంది.

గ్రామస్తులు అనుమానిస్తున్నారు – “ఈ పావురం ఎక్కడి నుండి వచ్చిందో? సాధారణ పావురం అయితే ఇలాంటి కోడ్ రింగులు, అక్షరాలు ఎందుకు ఉంటాయి?” అని.

పోలీసులు మాత్రం అధికారికంగా స్పందిస్తూ, ఇది గూఢచార చర్యల భాగమా? లేకపోతే ఇతర దేశాల్లో పరిశోధనల కోసం వదిలిన గుర్తింపు పావురమా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సంఘటనతో భవానిపేట గ్రామం మొత్తానికి ఇది హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ ‘గూఢచారి పావురం’ రహస్యం ఏమిటనేది అధికారిక నివేదిక వెలువడిన తర్వాతే స్పష్టమవుతుంది.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.