మహారాష్ట్ర వరదల్లో గల్లంతైన జగిత్యాల వారిలో రెండో మృతదేహం లభ్యం
మహారాష్ట్రలో సంభవించిన ఘోర వరదల్లో గల్లంతైన జగిత్యాల జిల్లాకు చెందిన వారి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. జగిత్యాల టి.ఆర్.నగర్‌కు చెందిన పాషా భార్య హసీనా మృతదేహం మంగళవారం ఉదయం లభ్యం కాగా, అదే రోజు సాయంత్రం సమీనా మృతదేహాన్ని కూడా అధికారులు గుర్తించారు.
ఇద్దరిని బయటకు తీయడంతో కుటుంబంలో శోకసంద్రం అలుముకుంది. అయితే ఇంకా ఒకరు గల్లంతైనట్లు సమాచారం. ఆ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు, మత్స్యకారులు జలదళ సహాయంతో శోధన కొనసాగిస్తున్నారు. మృతదేహాలను స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Post a Comment