జైలు నుంచి బయటకు వచ్చిన అఘోరీ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అఘోరీ చీటింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు నెలలుగా జైలులో ఉన్న అఘోరీ మంగళవారం చివరకు చంచల్‌గూడ జైలు గోడలు దాటి బయటకు వచ్చారు.
అఘోరీపై మొత్తం నాలుగు చీటింగ్ కేసులు నమోదవడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కేసు విచారణ కొనసాగుతుండగా ఇటీవల ఆయనకు బెయిల్ మంజూరైంది. అయితే సంబంధిత పత్రాలు ఆలస్యంగా అందడంతో విడుదల వాయిదా పడింది. మంగళవారం అన్ని ప్రక్రియలు పూర్తి కావడంతో అఘోరీ జైలు నుంచి బయటపడ్డారు.
జైలు గేటు వద్దకు రాగానే ఆయనను చూసేందుకు కొంతమంది అనుచరులు, ఆసక్తి గల ప్రజలు తరలివచ్చారు. బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన అఘోరీ, “ఇప్పటి నుంచి కాశీ వెళ్లి ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగిస్తాను” అని తెలిపాడు.
మరోవైపు ఆయనపై కేసులు పెట్టిన బాధితులు, ముఖ్యంగా వర్షిణి గురించి అఘోరీ ఏమంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశం కానుందని భావిస్తున్నారు.
Post a Comment