తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..! పలు రైళ్లు రద్దు
హైదరాబాద్, ఆగస్టు 28: తెలుగు రాష్ట్రాలు వరుణుని ఆగ్రహానికి తల్లడిల్లుతున్నాయి. తెలంగాణలో నిన్నటి నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలు ఇవాళ కూడా కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భువనగిరి, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
వరదల ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను ఏరియల్ సర్వే చేయనున్నారు.
అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, మన్యం, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. ప్రాజెక్టులోకి 3.8 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉండటంతో అధికారులు మొదటి హెచ్చరిక జారీ చేయనున్నట్లు సమాచారం.
- కరీంనగర్-కాచిగూడ
- కాచిగూడ-నిజామాబాద్
- కాచిగూడ-మెదక్
- మెదక్-కాచిగూడ
- బోధన్-కాచిగూడ
- ఆదిలాబాద్-తిరుపతి
అలాగే నిజామాబాద్-కాచిగూడ రైలు సేవలను పూర్తిగా రద్దు చేశారు. మహబూబ్‌నగర్-కాచిగూడ, షాద్‌నగర్-కాచిగూడ రైలు సర్వీసులు పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

Post a Comment