భద్రాచలంలో గోదావరి ఉధృతి – లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 28 : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలంలో గోదావరి నది నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. నది ఉధృతి కారణంగా పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ హెచ్చరించారు.
జిల్లా పోలీసులు, ఇతర విభాగాల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లరాదని ప్రజలకు సూచించారు. వాగులు, వంకలు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున వాటి వద్దకు వీడియోలు, సెల్ఫీలు కోసం వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.
వాహనదారులు ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు.

Post a Comment