మద్యం మత్తులో మహిళపై అఘాయిత్యం ప్రయత్నం – కేసు నమోదు

మద్యం మత్తులో మహిళపై అఘాయిత్యం ప్రయత్నం – కేసు నమోదు


మందమర్రి, ఆగస్టు 28: మందమర్రి పట్టణం ఫస్ట్ జోన్‌లో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఒక వ్యక్తి తన పొరుగింటి మహిళపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా ఆమెను తీవ్రంగా కొట్టిన సంఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, బాధితురాలు (55 సంవత్సరాలు) తన ఇంటి వద్ద ఉన్నపుడు, పొరుగింటి వ్యక్తి గంధం శ్రీకాంత్ (31 సంవత్సరాలు), తండ్రి నరసయ్య, మన్నెపు కులం, వృత్తి – సింగరేణి ఉద్యోగి (టూ ఇంక్లైన్, గోదావరిఖని) ఆమెను ఇంట్లోకి పప్పు ఉడికిందా అని చెప్పి లోపలికి పిలిచాడు. లోపలికి వెళ్ళగానే తలుపులు మూసి, చేతులతో కొడుతూ “వెయ్యి రూపాయలు ఇస్తాను, నేను చెప్పినట్లు విను, లేకుంటే చంపేస్తాను” అంటూ బెదిరించాడు.

భయంతో బాధితురాలు గట్టిగా అరవగా, అక్కడికే వచ్చిన ఆమె కోడలు సహాయానికి పరుగెత్తింది. కోడలు ఇంటి తలుపు బలంగా కొట్టడంతో, నిందితుడు వెనుక గోడ దూకి పరారయ్యాడు.

ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మందమర్రి ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.