గణేష్ పండగ పూట విషాదం.. ఆరుగురికి కరెంట్ షాక్!

గణేష్ పండగ పూట విషాదం.. ఆరుగురికి కరెంట్ షాక్!


కాకినాడ జిల్లా, ఆగస్టు 27:  పండగ ఆనందాన్ని ముసురుకున్న విషాదం ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలో వినాయక చవితి సందర్భంగా మండపం అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైటింగ్ ప్రాణాంతకమైంది.

గ్రామంలో వినాయక మండపం వద్ద లైటింగ్ కోసం స్తంభం ఎక్కి వైర్లు కడుతున్న సమయంలో ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో ఆరుగురు యువకులు నేలకొరిగారు. వారిలో చరణ్ (25) అనే యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సహచరులు, గ్రామస్థులు అప్రమత్తమై వారిని తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనతో గ్రామంలో పండుగ ఉత్సాహం ఒక్కసారిగా దుఃఖంలోకి మారిపోయింది. వినాయక చవితి ఉత్సవాల కోసం సిద్ధమవుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామం అంతటా విషాద వాతావరణం అలుముకుంది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.