జనగామ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
జనగామ జిల్లా లింగాల గణపురం మండలం వడిచర్ల వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ప్రయాణికులు దద్దోలు సురేష్, ఆయన భార్య దివ్య అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం, వడ్లపూడి గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. సురేష్ కరీంనగర్‌లోని ఒక గ్రానైట్ కంపెనీలో మార్కర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో వారి పిల్లలు మోక్షజ్ఞ, లోక్షణ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
కుటుంబం నెల్లూరు నుండి కరీంనగర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద వివరాలు తెలుసుకున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
🕯️ ఈ విషాదకర సంఘటనతో వడ్లపూడి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Post a Comment