ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య గర్భవతి అని తెలిసి కూడా కిరాతకంగా హత్య చేసిన భర్త

 

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య గర్భవతి అని తెలిసి కూడా కిరాతకంగా హత్య చేసిన భర్త

భార్య హంతకుడి కుటుంబాన్ని ఊళ్లోకి రానివ్వమంటున్న గ్రామస్థులు

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న సంచలన హత్యలు కలకలం రేపుతున్నాయి. పదో తరగతి బాలుడు బ్యాట్ కోసం బాలికను దారుణంగా హత్య చేసిన ఘటన మరువక ముందే మరో హృదయవిదారక సంఘటన వెలుగులోకి వచ్చింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య గర్భవతి అని తెలిసిన భర్త మహేందర్ రెడ్డి ఆమెను అతి కిరాతకంగా ముక్కలుగా నరికి, శరీర భాగాలను మూసీ నదిలో పడేసిన ఘటన రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి స్వగ్రామం కామారెడ్డి గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్థులు ఆయన కుటుంబాన్ని ఊర్లోకి రానివ్వమంటూ ఊరి పొలిమేరలో నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడ పహారాలో ఉన్నారు.

ఇప్పటికే కుటుంబ సభ్యులు ఊరిని ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇదిలావుంటే గాంధీ ఆస్పత్రిలో మృతురాలు స్వాతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి కాగా, ఈ రోజు దానిని బందోబస్తు నడుమ కుటుంబ సభ్యులకు అప్పగించి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

👉 ఈ ఘటన పట్ల గ్రామస్థుల ఆగ్రహం వెల్లువెత్తుతోంది.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.