అర్ధరాత్రి భర్త భార్యపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

అర్ధరాత్రి భర్త భార్యపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.


ఖమ్మం జిల్లా మధిర మండలంలోని మాటూరులో శనివారం అర్ధరాత్రి భర్త భార్యపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే—గ్రామానికి చెందిన చిల్ల సూర్యనారాయణ, లారీ డ్రైవర్‌గా విజయవాడలో పనిచేస్తూ మంగళగిరిలో అనాధ అయిన సాయి నాగలక్ష్మిని పరిచయం అయ్యాడు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉండగా, ప్రస్తుతం నాగలక్ష్మి మళ్లీ గర్భవతి.

ఇటీవల సూర్యనారాయణ మద్యానికి బానిసై, భార్యపై అనుమానాలు పెంచుకుంటూ తరచూ గొడవలకు తెరతీశాడు. శనివారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరగగా, బయటకు వచ్చిన సూర్యనారాయణ చికెన్ షాప్‌లో ఉండే కత్తితో భార్య నాగలక్ష్మి మెడపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు.

రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న నాగలక్ష్మిని స్థానికులు వెంటనే దవాఖానకు తరలించారు. ఆమెపై అక్రమ సంబంధం ఉందని సూర్యనారాయణ అనుమానించినట్లు సమాచారం. ఏడాది క్రితం కూడా అనుమానంతో భార్య తలపై రోకలిబండతో దాడి చేసిన సంఘటన గుర్తుచేసుకుంటున్నారు స్థానికులు.

సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ లక్ష్మీ భార్గవి సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.