నేడు విశాఖలో కేంద్ర మంత్రి పర్యటన
విశాఖ జిల్లా : విశాఖపట్నంలో ఈరోజు కీలక ఘట్టం జరగనుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ఉదయం నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి అనే రెండు అత్యాధునిక యుద్ధనౌకలను ప్రారంభించనున్నారు.
ఈ రెండు యుద్ధనౌకలు దేశీయ సాంకేతికతతోనే అత్యున్నత ప్రమాణాలతో నిర్మించబడినవిగా రక్షణ వర్గాలు తెలిపాయి. తొలిసారిగా ఒకే రోజు రెండు యుద్ధనౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం విశేషం. వీటి ద్వారా తీర రక్షణ, సముద్ర భద్రత మరింత బలోపేతం కానుందని అధికారులు భావిస్తున్నారు.
రాజ్‌నాథ్ సింగ్ పర్యటనలో భాగంగా నావికాదళ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. భారత నౌకాదళ భవిష్యత్ వ్యూహాలు, రక్షణ శక్తివృద్ధి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రివర్యుడి పర్యటన దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా హార్బర్ రోడ్, నావల్ డాక్‌యార్డ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలు పరిమితం చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఈ పర్యటనతో విశాఖ నగరం మరోసారి దేశ రక్షణ రంగంలో కీలక వేదికగా నిలుస్తోంది.
Post a Comment