ఈ నెల 23న అభివృద్ధి కార్యక్రమాలపై క్షేత్రస్థాయి పరిశీలన మేడారంకు సీఎం రేవంత్ రెడ్డి

ఈ నెల 23న అభివృద్ధి కార్యక్రమాలపై క్షేత్రస్థాయి పరిశీలన మేడారంకు సీఎం రేవంత్ రెడ్డి

ఈ నెల 23న అభివృద్ధి కార్యక్రమాలపై క్షేత్రస్థాయి పరిశీలన మేడారంకు సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: మేడారం అభివృద్ధి కార్యక్రమాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 23న మేడారంకు వెళ్లనున్నారు. అక్కడే అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి, తుది డిజైన్లను ఖరారు చేయనున్నారు.

శనివారం ICCC లో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధి ప్రణాళికపై అధికారులు, మంత్రులతో సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్, సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.