ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 7,267 ఉద్యోగాలు – నోటిఫికేషన్ విడుదల

ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 7,267 ఉద్యోగాలు – నోటిఫికేషన్ విడుదల

ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 7,267 ఉద్యోగాలు – నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: సెప్టెంబర్ 20: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ విభాగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 7,267 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 23, 2025 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

📌 పోస్టుల వారీగా ఖాళీలు

  • ప్రిన్సిపల్‌ – 225
  • పీజీటీలు – 1,460
  • టీజీటీలు – 3,962
  • హాస్టల్‌ వార్డెన్‌ (మేల్‌) – 346
  • హాస్టల్‌ వార్డెన్‌ (ఫీమేల్‌) – 289
  • జూనియర్ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (క్లర్క్‌) – 228
  • అకౌంటెంట్‌ – 61
  • స్టాఫ్‌ నర్స్‌ (ఫీమేల్‌) – 550
  • ల్యాబ్‌ అటెండెంట్‌ – 146

📌 అర్హతలు & వయోపరిమితి

  • ప్రిన్సిపల్ – పీజీ + బీఈడీ, గరిష్ట వయసు 50 ఏళ్లు
  • పీజీటీలు – పీజీ + బీఈడీ, గరిష్ట వయసు 40 ఏళ్లు
  • టీజీటీలు – డిగ్రీ + బీఈడీ, గరిష్ట వయసు 35 ఏళ్లు
  • అకౌంటెంట్ – డిగ్రీ/డిప్లొమా, వయసు 30 ఏళ్లు
  • ల్యాబ్‌ అటెండెంట్ – ఇంటర్/టెన్త్‌, వయసు 30 ఏళ్లు
  • హాస్టల్‌ వార్డెన్‌, స్టాఫ్‌ నర్స్‌ – సంబంధిత అర్హత, వయసు 35 ఏళ్లు
  • జూనియర్ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ – డిగ్రీ/ఇంటర్‌, వయసు 30 ఏళ్లు

📌 దరఖాస్తు ఫీజు

  • జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌
    • ప్రిన్సిపల్‌ పోస్టులకు – ₹2,500
    • పీజీటీ, టీజీటీ పోస్టులకు – ₹2,000
    • నాన్-టీచింగ్ పోస్టులకు – ₹1,500
  • ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌, మహిళలు – ₹500

📌 ఎంపిక విధానం

  • రాతపరీక్ష
  • ఇంటర్వ్యూ
  • ఫైనల్‌ మెరిట్‌ లిస్టు ఆధారంగా నియామకం

📌 జీతభత్యాలు

  • ప్రిన్సిపల్‌ – ₹78,800 – ₹2,09,200
  • పీజీటీలు – ₹47,600 – ₹1,51,100
  • టీజీటీలు – ₹44,900 – ₹1,42,400
  • అకౌంటెంట్‌ – ₹35,400 – ₹1,12,400
  • ల్యాబ్‌ అటెండెంట్‌ – ₹18,000 – ₹56,900
  • హాస్టల్‌ వార్డెన్‌ – ₹29,200 – ₹92,300
  • స్టాఫ్‌ నర్స్‌ – ₹29,200 – ₹92,300
  • జూనియర్ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ – ₹19,900 – ₹63,200

👉 దరఖాస్తుల చివరి తేదీ అక్టోబర్‌ 23, 2025.



కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.