రామచంద్ర హైస్కూల్ 37 ఏళ్ల తరువాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

 

రామచంద్ర హైస్కూల్ 37 ఏళ్ల తరువాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామచంద్ర హైస్కూల్ 1987–88 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 37 ఏళ్ల తరువాత ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ గురువుగారు నల్ల బ్రోలు సుబ్బారావు, లీలాకుమారి గారిని సత్కరించడం విశేషం.

సుభ్రమైన వాతావరణంలో సాగే ఈ సమావేశంలో ఆ కాలపు స్నేహ బంధాలను మరోసారి గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులు మధురానుభూతులను పంచుకున్నారు. 87 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా హాజరైన సుబ్బారావు , తన పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మీరు మీ మీ రంగాల్లో — ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ సమాజానికి ఉపయోగపడుతూ అభివృద్ధి చెందాలి. ఉన్నత స్థాయిలను చేరుకోవాలి. ఎల్లప్పుడూ మానవత్వం మర్చిపోవద్దు,” అని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో ఎం.డి. యాకూబ్, కూర శ్రీధర్, ఎం.డి. జమీల్, రవి, ఎస్. శ్రీను, నక్క భాస్కర్, నగేష్, బాలకృష్ణ, ఎం.డి. సత్తార్, సాలార్, రమణ, సత్యనారాయణ, సల్మాన్, అన్వర్ భాష, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

ఈ ఆత్మీయ కలయికలో స్నేహితులు పాత జ్ఞాపకాలను పంచుకుంటూ, భవిష్యత్తులో తరచుగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.