7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పురపాలక సీనియర్ అసిస్టెంట్
నిజామాబాద్: ఫిర్యాదుదారునికి సంబంధించిన వి.ఎల్.టి. ఫైల్‌ను ప్రాసెస్ చేయడానికి, వి.ఎల్.టి. నంబర్ కేటాయించేందుకు, అలాగే భవిష్యత్తులో ఫిర్యాదుదారుడి దుకాణం సజావుగా నడవడానికి సహాయం చేస్తానని హామీ ఇస్తూ, రూ.10,000/- లంచం డిమాండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్ (ఇన్‌ఛార్జ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్) కర్ణ శ్రీనివాస్ రావు, అభ్యర్థనపై తగ్గించిన రూ.7,000/- లంచం స్వీకరిస్తూ తెలంగాణ అవినీతి నిరోధకశాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు.
ఈ దాడి నిజామాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో జరిగింది.
🔹 ప్రజలకు అవగాహన:
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే వెంటనే తెలంగాణ అవినీతి నిరోధకశాఖను సంప్రదించవచ్చు.
📞 టోల్ ఫ్రీ నెంబర్: 1064
📱 WhatsApp: 9440446106
📘 Facebook: Telangana ACB
🐦 X (Twitter): @TelanganaACB
🌐 Website: acb.telangana.gov.in
👉 ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
Post a Comment