భద్రాద్రి కొత్తగూడెం దామచర్ల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి హైలెట్స్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దామచర్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభ ఎన్నికల కోసం కాదు, పేదల గూడెంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం సందర్భంగా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ—
-
“ఆనాడు ఇందిరాగాంధీ పేదవాడి ఆత్మగౌరవం కోసం ‘రోటీ, కప్డా ఔర్ మకాన్’ నినాదం ఇచ్చారు. వైఎస్ హయాంలో పేదలకు ఇండ్లు కట్టించి కలను నిజం చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇండ్లు ఇచ్చిన ఘనత సాధించింది. హనుమాండ్ల గుడి లేని గూడెం ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవు” అని గుర్తు చేశారు.
-
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుతూ ప్రతి పేదవాడికి రూ.5 లక్షలతో ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
-
గృహనిర్మాణ శాఖ బాధ్యతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించగా, ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.
-
“పేదరికం మాకు ఎక్స్ కర్షన్ కాదు.. అది జీవన విధానం. పేదరికాన్ని పారద్రోలడమే మా ప్రభుత్వ లక్ష్యం. కాంగ్రెస్ ఎప్పుడూ పేదల పక్షం” అని స్పష్టం చేశారు.
రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీతో పాటు, ఇళ్ల నిర్మాణం, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
అలాగే కుటుంబ తగాదాలను ప్రజలు తమ ఇంటి పెద్దల దగ్గర పరిష్కరించుకోవాలని, ప్రభుత్వాన్ని అందులోకి లాగవద్దని సూచించారు.
విద్యపై ప్రాధాన్యత ఉటంకిస్తూ—
- “మన తలరాతను మార్చేది విద్య ఒక్కటే. 20 వేల కోట్లు పాఠశాలల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, ఏటీసీ ఏర్పాటు చేస్తాం. చదువుకు ఏం కావాలో నన్ను అడగండి” అని పిలుపునిచ్చారు.
అంతేకాక, “ఖమ్మం జిల్లా ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు. రాష్ట్రంలో మరో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుంది. పేదోడి సొంతింటి కలను నిజం చేస్తుంది” అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Post a Comment