నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారుల మృతి – విషాదంలో గ్రామం

నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారుల మృతి – విషాదంలో గ్రామం


నారాయణపేట, సెప్టెంబర్ 3 : నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం తిమ్మారెడ్డిపల్లి తండాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.

స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పుణ్య నాయక్, జయ దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాదులో స్థిరపడ్డారు. వినాయక నిమజ్జనం సందర్భంగా వారి కుమారులు ఆకాష్ (4), అభి (3) హైదరాబాదు నుంచి మంగళవారం తండాకు చేరుకున్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం మరుగుదొడ్డి నిర్మాణం కోసం తవ్విన నీటి గుంతలో ఆడుకుంటూ పడి మృతిచెందారు.

ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల మరణవార్త విని తల్లిదండ్రులు మానసికంగా కృంగిపోయారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.