కల సౌకర్యాలతో మహా మేడారం జాతర – మంత్రి సీతక్క

కల సౌకర్యాలతో మహా మేడారం జాతర – మంత్రి సీతక్క


మేడారం జాతర సమయానికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని, భక్తుల సౌలభ్యం కోసం మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతోందని మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ప్రకటించారు.

సచివాలయంలో దేవాదాయ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల మంత్రులు కలిసి మేడారం మహా జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పూజారుల సూచనల మేరకు దేవాలయ ప్రాంగణానికి నూతన డిజైన్ పరిశీలించబడింది. భక్తుల దర్శనార్థం గద్దెలను ఒకే వరుసలో అమర్చే ప్రణాళికతో పాటు, ఎత్తు పెంపు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

జాతర ప్రారంభానికి ముందుగానే పనులన్నీ పూర్తి చేయాలని సీతక్క అధికారులను ఆదేశించారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వాలంటీర్ల నియామకం, అదనపు సదుపాయాల కల్పన చేపడతామని చెప్పారు. ఆదివాసీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా మేడారం పరిసరాలను తీర్చిదిద్దుతున్నామని, ఈసారి చరిత్రలోనే తొలిసారి రూ.150 కోట్లు కేటాయించామని వెల్లడించారు.

ముఖ్యమంత్రి సూచనలతో పనులు వేగవంతం చేస్తామని, పూజారులను ప్రతి దశలో భాగస్వామ్యం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. సమ్మక్క–సారలమ్మల త్యాగ ఔన్నత్యానికి తగిన వేడుకగా మహా జాతరను నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు హామీ ఇచ్చారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.