ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లా కందుకూరు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెళ్తున్న డీసీఎం మిల్లర్‌ను ఒక ఆటో ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, గాయపడిన వారిని తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
మృతులను యాచారం మండలం కురుమిద్ద గ్రామానికి చెందిన సత్తెమ్మ(50), శ్రీనివాస్(35), శ్రీధర్(25)గా గుర్తించారు. ఈ సంఘటనతో మృతుల ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.
👉 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Post a Comment