ములుగు గర్వకారణం – టైర్ పంక్చర్ షాపు యజమాని కుమార్తె డీఎస్పీగా ఎంపిక
ములుగు జిల్లా మల్లంపల్లి మండలానికి చెందిన అల్లెపు మౌనిక పట్టుదలతో ప్రతిభ నిరూపించారు. సాధారణ కుటుంబానికి చెందిన ఆమె తండ్రి సమ్మయ్య టైర్ పంక్చర్ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా చదువుపై పట్టుదల వదల్లేదు.
గ్రూప్-1లో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న మౌనిక, తెలుగులో పరీక్ష రాసి 315వ ర్యాంక్ సాధించారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో ఆమెకు డీఎస్పీ పదవి లభించింది.
👉 “లక్ష్యం దృఢంగా ఉంటే పేదరికం అడ్డంకి కాదని మౌనిక చూపించారు” అని స్థానికులు ప్రశంసిస్తున్నారు.
Post a Comment