దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నూతన కమిటీ

దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నూతన కమిటీ


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు వాసర్ల నాగమణి  అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె ఫౌండేషన్ నూతన కమిటీని ప్రకటించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలుగా రెంటపల్లి మాధవి లతను  నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సీతా కుమారి, జిల్లా అధ్యక్షురాలు రెంటపల్లి మాధవి లత, జిల్లా ఉపాధ్యక్షురాలు పూజారి జ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికల మాధవి, కార్యదర్శి మల్లు సరిత, ఆర్గనైజింగ్ సెక్రటరీలు బోగా లక్ష్మి, మాలోతు సువర్ణ తదితరులను నియమించారు.

అలాగే, భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జిగా నాగుల కుసుమ, పినపాక నియోజకవర్గ ఇన్‌చార్జిగా కూటాల దుర్గ, భద్రాచలం నియోజకవర్గ కార్యదర్శిగా బుల్ల విజయ కుమారి, మండల ప్రెసిడెంట్‌గా యాసా బేబీ, మణుగూరు మండల ప్రెసిడెంట్‌గా బింగి రమాదేవి, మణుగూరు వైస్ ప్రెసిడెంట్ గూగులోతు కవిత, జనరల్ సెక్రటరీగా అక్కి రాజ్యలక్ష్మిలను ప్రకటించారు.

ఖమ్మం జిల్లా అధ్యక్షురాలిగా కాబట్టి రేవతి, ప్రధాన కార్యదర్శిగా అనుమల వసంత బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా వాసర్ల నాగమణి మాట్లాడుతూ, “మహిళల హక్కుల పరిరక్షణ, రక్షణలో దిశ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుంది. నూతన కమిటీ సభ్యులు సమాజంలో మహిళలకు న్యాయం జరిగేలా కృషి చేయాలి” అని సూచించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.