మహిళలను వేధించిన యువకులు ఏడుగురు పోకిరిల అరెస్టు చేసిన షీ టీమ్
మహిళలను వేధించిన యువకులు ఏడుగురు పోకిరిల అరెస్టు చేసిన షీ టీమ్
మంచిర్యాల, సెప్టెంబర్ 21: మహిళలను వేధిస్తూ, విద్యార్థినులకు ఇబ్బందులు కలిగించిన ఏడుగురు యువకులను మంచిర్యాల షీ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
ఎస్సై ఉషారాణి నేతృత్వంలో షీ టీమ్ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టింది. మఫ్టీ దుస్తుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న యువకులను గుర్తించారు. ఆపై వారిని వెంటనే పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తరువాత నిందితుల తల్లిదండ్రులను పిలిపించి సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహించారు. యువకులకు మహిళలను వేధించడం తీవ్రమైన నేరమని, ఇలాంటి చర్యలు భవిష్యత్తును నాశనం చేస్తాయని స్పష్టంగా చెప్పారు. మళ్లీ ఇలాంటి సంఘటనలకు పాల్పడితే తప్పనిసరిగా క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Post a Comment