దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ బతుకమ్మ సంబరాలు

 దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ బతుకమ్మ సంబరాలు

దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ బతుకమ్మ సంబరాలు

భద్రాద్రి కొత్తగూడెం: దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు వాసర్ల నాగమణి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి, మహిళలతో కలిసి బతుకమ్మను ఆడిపాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "నవరాత్రుల్లో దుర్గామాత విగ్రహాన్ని భక్తితో పూజిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను, బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకోవాలి" అని పిలుపునిచ్చారు.

బతుకమ్మ చుట్టూ మహిళలు పాటలు పాడుతూ సంప్రదాయ ఆటలతో సందడి చేశారు. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పండుగను విజయవంతం చేశారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.