పోలీసులు ప్రజా సేవలో క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేయాలి – డీఎస్పీ నరేందర్ గౌడ్
పోలీసులు ప్రజా సేవలో క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేయాలి – డీఎస్పీ నరేందర్ గౌడ్
మెదక్ జిల్లా, తూప్రాన్, సెప్టెంబర్ 20: పోలీసులు ప్రజలకు సేవ చేస్తూ క్రమశిక్షణ, నిబద్ధతను ప్రథమ కర్తవ్యంగా తీసుకోవాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు.
శనివారం తూప్రాన్ పట్టణంలోని సెంట్ ఆర్నాల్డ్ స్కూల్ మైదానంలో స్థానిక పోలీసులు నిర్వహించిన ప్రత్యేక పరేడ్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, డ్రెస్ కోడ్‌ను సమీక్షించిన డీఎస్పీ, మరింత నాణ్యతతో విధులు నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు అందించారు.
పోలీసుల పరేడ్ సిబ్బందిలో ఆత్మస్థైర్యం, శారీరక ఫిట్నెస్, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజా సేవలో ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీఐ రంగ కృష్ణ, ఎస్సైలు శివానందం, యాదగిరి తోపాటు తూప్రాన్ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment