భార్యతో గొడవ.. ఏడాది చిన్నారిని చంపిన తండ్రి

భార్యతో గొడవ.. ఏడాది చిన్నారిని చంపిన తండ్రి

భార్యతో గొడవ.. ఏడాది చిన్నారిని చంపిన తండ్రి

సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో చోటుచేసుకున్న మానవత్వాన్ని కలచివేసే ఘటన అందరినీ కలతపరిచింది.

కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్‌కు నాగమణితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడాది వయసున్న కుమార్తె భవిజ్ఞ ఉన్నది.

శుక్రవారం అర్థరాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో భయంతో చిన్నారి ఏడవడంతో తండ్రి అసహనానికి లోనయ్యాడు.

కోపంలో చిన్నారి కాళ్లు పట్టుకొని రెండు సార్లు నేలకేసి బాదాడు. తీవ్ర గాయాలతో చిన్నారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.