బాల్య వివాహాలపై అవగాహన సదస్సు – డి.సి.పి.ఓ కరుణశీల

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు – డి.సి.పి.ఓ కరుణశీల


మెదక్, సెప్టెంబర్ 19: కలెక్టరేట్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో బాల్య వివాహాల నుండి విముక్తులైన పిల్లలు, వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా బాలల సంక్షేమ సమితి మహిళా శాఖ మరియు విజన్ సంస్థ సంయుక్తంగా చేపట్టాయి.

ముఖ్య అతిథిగా హాజరైన డి.సి.పి.ఓ కరుణశీల మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే శారీరక, మానసిక, ఆర్థిక మరియు విద్యా పరమైన నష్టాలను వివరించారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం వలన కుటుంబ భారాన్ని మోసే పరిస్థితులు, పోషణలో వచ్చే ఇబ్బందులు, వ్యక్తిగత జీవితంపై పడే ప్రతికూల ప్రభావాలను పిల్లలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు ఉప్పలయ్య, బాలల రక్షణ అధికారి కరుణశీల, విజన్ సంస్థ డైరెక్టర్ కైలాష్, ప్లాన్ ఇండియా అధికారులు సుజాత రాయ్, రాహుల్, విజన్ సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాజు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు యాదగిరి, సంజీవ్, జిల్లా బాలల సంక్షేమ సమితి మరియు చైల్డ్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు.

సుమారు పది మంది బాల్య వివాహాల నుండి విముక్తులైన పిల్లలు, వారి తల్లిదండ్రులు మరియు ఇతర సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.