మైనారిటీ సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలు : హర్షం వ్యక్తం చేసిన మహబూబ్ జానీ

 మైనారిటీ సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలు : హర్షం వ్యక్తం చేసిన మహబూబ్ జానీ

మైనారిటీ సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలు : హర్షం వ్యక్తం చేసిన మహబూబ్ జానీ

హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముస్లిం మైనార్టీ బిసి ఈ ఫోర్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ మహబూబ్ జాని హర్షం వ్యక్తం. తెలంగాణలో మైనారిటీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు కొత్త పథకాలను ప్రారంభించింది. “ఇందిరమ్మ మైనార్టీ మహిళ యోజన”, “ రేవంత్ అన్నాక సహారా మిస్కిన్” అనే పేర్లతో ఈ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

విడాకులు పొందిన మహిళలు, అనాథలు, అవివాహిత మహిళలకు రూ.50 వేల ఆర్థిక సాయం అందజేయనున్నారు. అదేవిధంగా ఫకీర్, దూదేకుల వర్గాలకు వాహనాలు అందించి ఆర్థికంగా బలోపేతం చేయనున్నారు.

ఈ సందర్భంలో మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, “మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ఈ పథకాల ప్రధాన లక్ష్యం. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది” అన్నారు. పథకాల కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వ అంకితభావానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

మహబూబ్ జానీ మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు కరుణా సహకారం అందించే దిశగా అడుగులు వేస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు రానున్నాయని మంత్రి తెలిపారు అని అన్నారు. ఆన్ లైన్లో https://tgobmms.cgg.gov.in లో అక్టోబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.