పారిశ్రామిక వాడ రహదారిపై గుంతలతో పాదాచారులు, వాహనదారులు ఇబ్బందులు
పారిశ్రామిక వాడ రహదారిపై గుంతలతో పాదాచారులు, వాహనదారులు ఇబ్బందులు
మెదక్ జిల్లా, సెప్టెంబర్ 20: మనోహరాబాద్ మండలంలోని కాళ్ళకల్ గ్రామం నుండి ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడకు వెళ్లే రహదారి వర్షాల కారణంగా గుంతల మయం అయింది. దీంతో పరిశ్రమలకు వెళ్లే కార్మికులు, పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, భారీ వాహనాలు రహదారి పక్కన నిలిపివేయడం వల్ల ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో చీకట్లో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై టిఎస్ఐఐసి అధికారులు, సంబంధిత విభాగం వెంటనే స్పందించి రహదారిని బాగు చేసి, పారిశ్రామిక వాడకు రాకపోకలు సులభం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Post a Comment