నవ మహిళ సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ

నవ మహిళ సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నవ లిమిటెడ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాల భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళ సాధికార కేంద్రంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది.

ఈ కేంద్రంలో మహిళలు తాటి ఆకుల కళాకృతులు, వివిధ రకాల యూనిఫార్ములు కుట్టి విక్రయించడం ద్వారా రూ. 1,50,000/- ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని చెక్కుల రూపంలో మహిళలకు అందజేశారు.

చెక్కుల పంపిణీ కార్యక్రమంలో టెలంగాణా ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్ రియర్ అడ్మిరల్ ఎల్.వి. శరత్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చెక్కులను అందజేశారు. ఆయనతో పాటు సి.ఎస్.ఆర్ జనరల్ మేనేజర్ ఎం.జి.ఎం. ప్రసాద్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రియర్ అడ్మిరల్ శరత్ బాబు మాట్లాడుతూ –“మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి సాధికార కేంద్రాలు మహిళల జీవితాలను మార్చే వేదికలుగా మారతాయి” అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాలు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.